స్వప్న సుందరి చిత్రలేఖ

స్వప్న సుందరి ...


 ప్రకృతిలో జీవం యొక్క ఆకృతికి రూపాన్ని ఇచ్చే అదృష్టం ఇద్దరికే ఉంది.ఒకరు బ్రహ్మ మరొకరు చిత్రకారుడు. అలాంటి ఒక  చిత్రకారుడు స్త్రీ సౌందర్యం పై ఉన్న ప్రేమతో గీసిన చిత్రపటం,అతని వాంఛను ఏవిధముగా తీర్చింది. ఆ చిత్రపటంతో అతనికున్న అనుబంధం ఎలాంటిది?.సరసంతో ఆవిడని రంజింపజేయడంలో సఫలీకృతం అయ్యాడా? అనేదే నా ఈ "స్వప్నసుందరి" కధ".

*𝕿𝖍𝖊 𝖒𝖔𝖘𝖙 𝖇𝖊𝖆𝖚𝖙𝖎𝖋𝖚𝖑 𝖙𝖍𝖎𝖓𝖌𝖘 𝖎𝖓 𝖙𝖍𝖊 𝖜𝖔𝖗𝖑𝖉 𝖆𝖗𝖊 𝖙𝖍𝖊 𝖋𝖑𝖔𝖜𝖊𝖗𝖘, 𝖆𝖋𝖙𝖊𝖗 𝖙𝖍𝖆𝖙 𝖙𝖍𝖊 𝖌𝖎𝖗𝖑𝖘 𝖜𝖍𝖔 𝖆𝖗𝖊 𝖒𝖚𝖈𝖍 𝖒𝖔𝖗𝖊 𝖇𝖊𝖆𝖚𝖙𝖎𝖋𝖚𝖑. *

      ఎలా ఉన్నా అమ్మాయి అంటే అందం అంతే.సౌందర్యం అంటే అందరికి మక్కువే.ప్రకృతిని,మగువని అంతగా ఆరాదిస్తుంది ఈ ప్రపంచం.కానీ మగువకి ఎక్కడో ఒక మోస్తారు ఇంపు ఎక్కువ.మగువని చూస్తే ప్రకృతికి ఎక్కడలేని అసూయ.ఎంతటి అందమైన పుష్పం అయిన సరే కాంత చెంత చేరగానే వాడిపోతుంది. ఎందుకనుకున్నారు! ఆ అందాన్ని చూసి ఓర్వలేక.ప్రపంచానికి ప్రకృతి అందాన్నిస్తే, ప్రకృతికి భామ అందాన్నిస్తుంది.
కలికిని(స్త్రీ) కనువింపుగా పరిచయం చేసే సత్తా ఇద్దరికే ఉంది.ఒకటి "రచయిత"కి రెండు "చిత్రకారుడి"కి.
               
                 ఇందువదన(స్త్రీ) మీద  మదిలో ఉన్న ప్రీతికి రంగులను కలిపి  ప్రేమరాసిగా చూపడంలో వారికి వారే సాటి.
     అటువంటి ప్రేమేచ్ఛ కలిగిన ఒక చిత్రకారుడు తన చిత్రపటానికి తన మీద ఉన్న ప్రేమని,వాంఛని ఏ విధంగా వ్యక్తపరిచాడు అనేదే నా ఈ కధ.


𝙄 𝙝𝙖𝙫𝙚 𝙡𝙚𝙖𝙧𝙣𝙚𝙙 𝙣𝙤𝙩 𝙩𝙤 𝙬𝙤𝙧𝙧𝙮 𝙖𝙗𝙤𝙪𝙩 𝙡𝙤𝙫𝙚, 𝙗𝙪𝙩 𝙩𝙤 𝙝𝙤𝙣𝙤𝙧 𝙞𝙩'𝙨 𝙘𝙤𝙢𝙞𝙣𝙜 𝙬𝙞𝙩𝙝 𝙖𝙡𝙡 𝙢𝙮 𝙝𝙚𝙖𝙧𝙩...
 
పొద్దుపొద్దున్నే లేచి అలా నడకకి పోయిన మన చిత్రకారునికి ఒక చోట అందమైన కొలను కనపడింది.అది ఎంత నిశ్శబ్దన్గా ఉంది అంటే మూసిన ముత్యాల మీద ప్రవహిస్తున్న నీటి చప్పుడు కూడా వినిపిస్తుంది.అక్కడే సంధ్యాసమయాన్ని ఆహ్వానిస్తున్న ఒక లిల్లీ పువ్వుని చూసి ఇష్టంగా తీసుకుని జాగ్రత్తగా బుట్టలో పెట్టి పట్టుకు వస్తున్నాడు.అలా వస్తున్న అతనికి ఒక కనువింపైన దృశ్యం కంటపడింది.ఒక పావురం రోజా పువ్వు రేకుని ముక్కుతో పట్టుకొని ఆకాశం వెంబడి ఎగురుతూ ఒక చోట ఆగింది.ఇదేంటి గాలిలో అకస్మాత్తుగా ఆగింది అని చూస్తున్నాడు చిత్రకారుడు.ముక్కుతో పట్టుకున్న ఆ రోజపువు రేకుని వదిలేసింది.ఏంటా అని చూస్తే.....! ఆకాశంలో మబ్బులతో చేయబడిన ఒక ఆకృతి కనపడింది. ఎవరిది అనుకున్నారు.. మబ్బులతో చేయబడిన ఒక ముద్దుగుమ్మది.ఆ రోజాపూవు రేకు ఆ లలనకి పెట్టిన కుంకుమ బొట్టులా ఉంది...ఆ దృశ్యాన్ని చూసిన ఇతగాడి ఆనందానికి హద్దులులేవు.అక్కడే ఉన్న రోజాపువు రేకులను కొన్ని తీస్కుకొని బుట్టలో పెట్టుకొని ముందుకు సాగాడు. ఆ పావురపు ఈక ఒకటి ఎగిరి వచ్చి అక్కడే పడింది. దానిని కూడా బుట్టలో పట్టుకున్నాడు.ఇక నిర్ణయించుకున్నాడు ఈరోజు ఆ కనపడిన కుందనపు బొమ్మని ఎలా ఐన గీయాలి అని.... ఇంటికొచ్చి రంగులని,ఖాళీ పటాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు...పక్కనుండి "నేనో!".."నేనో!" అని అరుస్తున్నాడు "నందు" గాడు..నందు ఎవరనుకున్నారు మన చిత్రకారుడి "కుంచె"...."నువలేకుండా ఎలా రా ఈరోజు నీకు ఒక కలికి చకోరిని పరిచయం చేస్తా "అని చిత్రకారుడు అనగానే నందుగాడి ఆనందానికి అవధుల్లేవ్. అయితే పదండి గురుగారు అని నందు అనేలోపే అతగాడు ఏదో ఆలోచిస్తూ బయటకి వెళ్లిపోయారు....నందుగాడు ఆ అందం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.. ఈలోపు గురూగారు వచ్చారు....బుట్టలో చాలా పదార్థాలు పట్టుకొచ్చారు... నెమలి పించం,ఆవు క్షీరం,ఎంగిలి కాని నీరు,కాంత ఎంగిలి చేసిన పీచుమిఠాయి, కాంత చెమట చుక్క,తులసి దళం,తేనె మరియు నేరేడు పండు.
ఇవన్నీ ఎందుకు తెచ్చారో కూడా ఎవరికి చెప్పలే..

*ఒక బల్లకి ఖాళీ చిత్రపటాన్ని అతికించి,చెవిపైన ఒక పెన్సిల్, బల్ల కింద ఒక కొలబద్ద అన్ని సిద్ధం చేసుకొని ఈ ప్రపంచానికి కొత్త వనితని పరిచయం చేయడానికి సన్నదమయ్యాడు...ముందుగా పొద్దున్న చూసిన ఆ తారని గుర్తుచేసుకుంటున్నాడు...పెన్సిల్ తీసి ఆ అమ్మాయి బార్డర్ లైన్ గీశారు.మెడ దగ్గర మొదలుపెట్టి,నడుము,కాళ్ళు, పాదాలు అన్నింటి సరిహద్దుల్ని గీసి మరల మెడ దగ్గరకి వచ్చారు. వధనాన్ని గీసే ముందు మిగతా శరీరాన్ని గీయాలనుకున్నారు.

𝙬𝙚 𝙡𝙤𝙫𝙚 𝙩𝙝𝙞𝙣𝙜𝙨 𝙬𝙚 𝙡𝙤𝙫𝙚 𝙛𝙤𝙧 𝙬𝙝𝙖𝙩 𝙩𝙝𝙚𝙮 𝙖𝙧𝙚.

#మంచి గంథాన్ని ఎంగిలి కాని నీటితో కలిపి నెమలిపించాన్ని అందులో ముంచి సున్నితంగా మెడకి గంధపురంగుని అద్దాడు...
#ఆవుక్షీరాన్ని(పాలని) పావురపు ఈకతో జోడించి నడుము భాగానికి స్వచ్ఛమైన తెలుపురంగుని ఇచ్చాడు.మరి బొడ్డు పరిస్థితేంటి అని ఆలోచిస్తున్న కుంచెకి సమాధానంగా ఈకని వెనక్కి తిప్పి నేరడుపండుకి గుచ్చి నలుపు రంగుని కొంచం తీసుకుని ఆ స్థానంలో అద్దాడు.వారెవ్వా...నడుముని ఇంత అందంగా ఏ చిత్రకారుడు చెక్కి దిద్దిఉండడు.
# ఇక ఆడువారి చిన్ని వేళ్ళకి ఉండేంత అందం అంతా ఇంతా కాదు.వాటిని ఎలా గీయాలా అని ఆలోచిస్తున్న అతనికి దీపం ఎదురుపడింది.ఆ దివ్వె వెలుగునుంచి వచ్చిన నల్లటి పొగ ఒకచోట చేరి పొడిగా అంటుతున్న దృశ్యాన్ని సునిశితంగా గమనిసున్నాడు.ఆ నిశిపొడిని కుంచెకి అంటించి,ఆ కుంచెతో ఒక చేతి మధ్య వ్యత్యాస రేఖల్ని గీశాడు. వాటి మీద తెలుపు రంగుని అద్దాడు.
           ఇలా శరీరాన్ని వివిధ సౌందర్యమైన పదార్థాలతో  గీసి ,మరింక ఎక్కువ ఇంపుని అందించారు.

*𝙇𝙤𝙫𝙚 𝐋𝙤𝙫𝙚𝙨 𝙩𝙤 𝐋𝙤𝙫𝙚 𝐋𝙤𝙫𝙚*

     ఇక వధనాన్ని గీయాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి అందాన్ని చూపిద్దామ అని ఆలోచిస్తున్నాడు. ఈలోపు తన యవ్వన వయసు ప్రేమికురాలి కళ్ళు గుర్తువచ్చాయి. వాటిని మదిలో ఓ పక్కన ఉంచాడు.వెన్నెల వేళ సాయంకాలపు సంద్రపు అలల సంగమం గుర్తుకువచ్చింది. వాటిని పెదవుల స్థానంలో వాడుదాం అని వాటిని కూడా మదిలో ఉంచాడు.ఉదారమైన నుదురు,ఎరుపెక్కిన బుగ్గలు, సొట్ట బుగ్గలు, ముక్కుపుడక,ఘాటైన కాటుక,మధ్యస్థాయిలో ఉన్న రింగురింగుల జుత్తు ఇలా చాలా అనుకుంటూ ఉన్నారు మన చిత్రకారుడు.

ఇక సౌందర్యవధనాన్ని గీస్తున్నారు.. చిన్న పెన్సిల్ ముక్క తీసుకుని మృదువుగా కనపడి,పడనట్టుగా వధన ఆకృతిని గీసారు.ముందు కళ్ళను గీశారు.తర్వాత ముక్కు,పెదవులు,చెవి గీశారు...

#ఒక కన్ను మూసి ఉన్నట్టుగా మరొక కన్ను తెరిచి ఉన్నట్టుగా గీయాలి అని ఒక ప్రణాళిక మదిలో అనుకుంటూ ఎదురుగా కుర్చీ మీద కూర్చున్నాడు.ఎదురుగా ఉన్న ఆ చిత్రపటానికి ప్రాణం ఉన్న  వైనాన్ని ఊహించుకుంటున్నాడు..అద్భుతః👌👌...ఇతన్ని చూస్తూ కన్ను కొడుతోంది ఆ జిలిబిలి తార....
𝕿𝖍𝖊 𝘦𝘺𝘦 𝖘𝖍𝖔𝖚𝖙𝖘 𝖜𝖍𝖆𝖙 𝖙𝖍𝖊 𝖑𝖎𝖕𝖘 𝖋𝖊𝖆𝖗 𝖙𝖔 𝖘𝖆𝖞

  "పుష్పములు ఎలా అయితే వాటి భావాలను మౌనంగా తెలియజేస్తాయో,ఆడవారు కూడా మౌనంగా వారి నయణములతో భావాలను వ్యక్తపరుస్తారు".

@ మూసివున్న కన్నులపైన ఆ చిత్రానికి అర్థమయ్యేటట్లుగా తనపై ఉన్న ప్రేమని వ్యక్త పరిచేందుకు ప్రేమలేఖ రాసాడు.
# ఆ ప్రాణం ఉన్న మాణిని(స్త్రీ) కన్నులను తిలకించనీకి అతి దగ్గరగా వెళ్లిన అతని పేదవులకు ఆమె యొక్క వెచ్చటి శ్వాస తగిలింది...
  @ ముక్కుని సునిశితంగా గీశాడు. ఎలా అంటే ఆ చిత్రపటం ముక్కునుంచే శ్వాస వస్తుందేమో అన్నట్టుగా...
# ఇక ఆ స్త్రీ పెదవులు ....శ్వాస పైపెదవిని తాకుతుంటే మునిపంటి కింద కిందిపెదవి నలుగుతుంటే అలా చూస్తూ ఉండిపోయాడు చిత్రకారుడు
 @ పెన్సిల్ ముళ్ళు పెదవిని తాకితే కందిపోతాయేమో అని పెన్సిల్ ని వంచి పెదవులను గీశాడు.
        ఇక తన ఆలోచనలకి రంగులను అద్దడమే మిగిలివుంది.
# రోజపువ్వు రెక్కలని పాలలో అమితంగా కలిపితే వచ్చిన దానిలో పావురపు ఈకని ముంచి, దానిని మూసిన నయనం పైన అద్దాడు.. మూసిన కనులపై లేత గులాబీ రంగు హుందాతనానికి సంకేతం.. తెరిచిన కన్నుకి ఆకాశాన్ని దొంగిలించి అక్కడ దాచాడ అన్నట్టుగా లేత నీలపు రంగుని పూసాడు.

#అదే రోజపువ్వుల రేకులని ఉపయోగించి నెమలిపించంతో సున్నితంగా బుగ్గలకు లేత కుంకుమ రంగుని పూసారు.బూరె బుగ్గలపై ఎరుపు రంగు సిగ్గుకి సంకేతం.మరికొంచెం రంగునివ్వడానికి ఒక లలన ఎంగిలి చేసిన పీచుమిఠాయిని ఆ బుగ్గల మీద అద్దాడు..

#పంటి కింద ఉన్న పెదవులను కొంచెం చిలిపిగా చూపియ్యాలంటే ఘాటు రంగు కావాలి. మామూలుగా అయితే పెదవులు ,రోజా రెక్కల మాదిరి ఉన్నాయని అంటారు... కానీ కొంచెం ఘాటు భావాన్ని అందించడానికి చిటికిన వేలిని తేనె సీసాలో ముంచి దానిని పెదవుల పైన అద్దాడు...ఎంత ఘాటుగా కనపడుతున్నాయో!!!

# అగ్గిపుల్లని అదే తేనె సీసాలో ముంచి ముక్కు పైన చిన్న చుక్క పెట్టాడు..ముక్కుపుడక కోసమేమో...తెలుగోళ్ళకి ముక్కు పడక పై ఉన్న మక్కువ,బలహీనత అలాంటిది మరి..
@ క్రింది పెదవి కింద చాలా చిన్న చుక్క పెట్టాడు.పుట్టుమచ్చ కోసమేమో.గురుగారికి పుట్టుమచ్చ మీద కూడా ఏంటో అంత పట్టింపు.

ఇంచుమించు మొత్తం చిత్రపటం పూర్తిగావొచ్చింది.ఇంపు పెంచనీకి ఏవేవో చిరు ప్రయత్నాలు చేద్దాం అని చూస్తున్నారు.జుత్తుని కొద్దిగా కన్నులు మీదనుంచి బుగ్గలపైపడేటట్టుగా గీశాడు..భామ  అందం ఉట్టిపడేలా చేయనీకి ఆకుపచ్చ రంగు చీరగా కట్టి,కొంగుని బొడ్డులో దోపారు.





  పొద్దున్న అతని మదిలో ఎటువంటి చిత్రం అయితే ఉందొ ఆ చిత్రాన్ని పటం పై చేర్చి అందం అసూయ పడేలా, లోకం చూడని వింతలా,ఒక అందమైన నవల లా ఆ చిత్రపటాన్ని తయారుచేసాడు.

      అలా ఆ చితపటాన్ని చూస్తూ తనను తాను మైమరచిపోయాడు..
         లేత నెలపు కన్నులతో ,ఎరుపెక్కిన చిల్లుబుగ్గలతో, వెర్రెక్కించే ముక్కు పుడకతో  సన్నని నడుముతో నున్నని పాదాలతో ఒక వన్నెలాడి చప్పుడు చేయకుండా నక్కుతూ చిత్రకారుడి వైపు వస్తుంది.. వెనుక నుంచి వచ్చి కళ్ళని మూసి "ఎలా ఉన్నావ్ బావ?" అని అడిగింది.."
బావా!"ఎవరది అని అనుకుంటూ ముందుకు లాగి చూడగానే ఒక తెల్లని అప్సరస ...ఎవరనుకున్నారు... మునుపటి క్రితం తాను గీసిన చిత్రపట సుందరి...
                      "హేయ్ నువ్వా" అంటూ అక్కడున్న తేనీటిని తన మీదకి విసిరేశాడు... అది పోయి ఆవిడ పెదవులపై పడింది. కళ్ళు తెరచి "ufff" అని ఊదగానే ఆ పెదవుల పైనున్న తేనీయం పోయి  చిత్రకారుడి పెదవుల పైన పడింది..ఆ స్త్రీ యొక్క పెదవుల తీపి, శ్వాసలోని ఘాటు అతనికి తెలుస్తున్నాయి.

# ఎక్కడున్నవారు అక్కడ నిల్చున్నారు.చిత్రకారుడు ఆ భామ కళ్ళలోకి చూడడం మొదలుపెట్టాడు...ఆమె కూడా సూటిగా చూస్తుంది. దృష్టి రహదారి పైన భావాల పరస్పర రవాణా జరుగుతోంది..కొంచం ఏమార్పు గా ఉంటే  ప్రమాదాలు కూడా జరుగుతాయేమో...హహ..
"స్త్రీ నయనములు నెమలి పించము మాదిరి.. అందులో ఎన్ని ఈకలు ఉంటాయో వీరి కళ్ళలో అన్ని సందేశాలు ఉంటాయి,పించంలో ఎన్ని  రంగులుంటాయో,ఆ కళ్ళలో అన్ని భావాలు ఉంటాయి".
చిత్రకారుడి కళ్ళు ఆ పచ్చని చీర కుచ్చిళ్ళలో చేరి అక్కడి నుండి ఎటు పోవాలో తెలియక తికమకగా ఉన్నాయి.
      ఇటువంటి సమయంలో భావాల్ని అర్డంచేసుకుని సమయం వృధా చేయకూడదని అర్థం చేసుకున్న చిత్రకారుడు ముందుకుపోయాడు.
          దగ్గరకి వెళ్లి ముక్కుపుడకని ముద్దుపెట్టుకొని, సొట్టబుగ్గలపై హస్తలాగవాన్ని ప్రదర్శించాడు.
          కన్నులపై పడుతున్న ఆ శిరోజాలను ముక్కుతో పక్కకి లాగుతూ బూరె బుగ్గల తీపి రుచి చూసాడు.
         ఆ దివ్యాంగన నడుము మీద చేయి వేసి ముందుకి లాగి ఆమె పెదవుల మీద పడివున్న రోజపువ్వు రెక్కలని పెదవులతో తీసి ఆమె నుదుటి పై కుంకుమ మాదిరి పెట్టి ఒక ముద్దు పెట్టాడు.(నుదుటి పై ముద్దు బాధ్యతకి సంకేతం,కుంకుమ పెట్టేటిది నువ్వు నా సొంతం అని చెప్పడానికి సంకేతం)
        ఆమె శిరోజాలలో ఉన్న మల్లెపువ్వుల పక్కన రోజా పువ్వుని పెట్టాడు..(మిత్ర స్థానంతో పాటు ప్రేయసి స్థానాన్ని ఇవ్వడానికి ఇది సంకేతం).

     పూవుని శిరోజాలలో పెట్టి ఆమెని హత్తుకున్న అతనికి ఆమె శ్వాస ఏదో చెప్తున్నట్టు అనిపించింది...తీక్షణంగా వినగా అదేమిటో అతనికి అర్థమైంది.. వారి మధ్య రహస్యాలు మనకెందుకులేండి...
                  హత్తుకున్న అతనికి ఆమె మెడ మీద జాలువారిన పుప్పొడి అతని హుషారును పెంచే మత్తు పదార్థంలా తోడ్పడగా,అతని స్వేదపు సువాసన ఆమెకు హుషారు పెంచే మందులా తోడ్పడింది.

     ఇలా తన సరసశృంగారసార్వభౌమాధికారాన్ని ప్రదర్శించి ఆమెని రంజింపచేసాడు.చివరగా ఆమె కళ్ళకు ఉన్న కాటుకని చిటికెని వేలితో తీసి ఆమె కాలి చిటికెన వేలికి దిష్టి చుక్క పెట్టాడు...ఆ దిష్టిచుక్క కూడా ఆమెకు అలంకారం లానే ఉంది....హహ ఇలా ఆమెతో సమయం గడుపుతున్న అతనికి "కృష్ణ ..!కృష్ణ...! లే సమయమైంది" అని వినపడింది...

          "కళ"ని పక్కన పెట్టి "కల"లుకంటున్న  చిత్రకారుడు లేచి చూసేసరికి ముందర ఆ చిత్రపటం ఉంది.."ఇదంతా కలయా" అబ్బా! అని తనలో తాను గొణుక్కుంటు..ఏంటి మంచి కలని చెడగొట్టావ్ అని నిద్రలేపిన వారిని తిడుతుండగా ,"రేయ్ ఆగరా....! అబ్బాబ్బాబ్బా . ఏమి అందం. ఏం గీశావ్ రా.... అద్భుతః" అని చెప్పేసి...అతను వచ్చిన విషయం మర్చిపోయి" ఏమి అందం!",..," ఏమి అందం!" అనుకుంటూ వెళ్ళిపోయాడు.... "అమ్మో! నా బండదానికి దిష్టి తగిలిపోతుంది అని అనుకుంటూ నేరేడు పండును పిండి కాలి చిటికెన వేని అంచున చిన్న దిష్టి చుక్క పెట్టాడు...ఇలా తాను పరిచయం చేద్దామనుకున్న ప్రపంచ సుందరిని ప్రపంచానికి పరిచయం చేసి ,కలలో  తన వాంఛని సఫలీకృతం చేసుకున్నాడు....ఎంతైన కృష్ణ నామం కలిగిన వాడు కదా...!
                    .........^.^.^.^...........
                        𝙋𝙚𝙣 𝙣𝙖𝙢𝙚 : 𝕯𝖗𝖊𝖆𝖒𝖟 𝕯𝖗𝖊𝖆𝖒𝖟

Comments

Popular Posts