WHO ARE YOU .?
Copyrights :
No part of this writing may be reproduced, Transmitted or stored in a retrieval system, in any form or by means, electronic, mechanical,photocopying , recording or otherwise , without the prior permission of the author...
Do remember :
Piracy begins where Creativity ends..
Note : Characters in this are purely fictional...
© All rights reserved
Who are you ?
కప్పు ఎత్తి చివరి చుక్కని నాలుక మీద ఒంపుకొని అమ్మయ్య కొంచెం relief గా ఉంది అన్నట్టు expression తో బండి ఎక్కాడు...
అది ఒక చీకటి దారి...
రోడ్డుకి ఇరువైపులా వర్షానికి తడిసిన చెరకు పంట గుబురుగా ఉంది...
పెద్దగా కర్రెంట్ లైట్స్ లేని ప్రదేశం...
నిషిని వెక్కిరిస్తూ గుడ్లగూబలు చేసే శబ్దాలు భయాన్ని కలిగించేటట్టు ఉన్నాయి...
ఏది దారో ఏది పోలమో తెలీకుంటుంది ..
పైగా పొదల ఆకారం మనిషిని పోలిన ఆకారంలా ఉండటం హరిని కొంచెం బయపెట్టింది ..
ఇక లాభం లేదని వేగాన్ని 40 నుండి 80 కి పెంచాడు...
స్పీడోమీటర్ ముల్లు కదలిక వైపు ఒక చూపు వేసి gear మార్చి accelerate చేసేసరికి వెనకనుండి బురద గాల్లోకి తుల్లుతుంది...
Sudden గా "..డమాల్..!" అని పెద్ద చప్పుడు...
కళ్ళు తెరచి చూస్తే బండి దూరంగా పడివుంది..కష్టంగా ముఖం తిప్పితే ఒక కారు... బంపర్ మీద ఒక సాలిడ్ structure...background పాటతో చేతిలో లైటర్ నోట్లో సిగార్ తో పాటు స్క్రీన్ కింద ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న ఒక tagline కనిపించాయి...సిగార్ ని వెలిగించి లైటర్ని ఒక ఊపు తో ఆపి బండి దిగారు...
ఏరా హీరో... చూస్కొని డ్రైవ్ చేయాలిగా అని ఒక ruff voice తో ఒక dialogue వేశారు..
అడ్డడడ్డే...బాగా దెబ్బలు తగిలినట్టున్నాయే... అందుకే ఏ పని చేసిన ముందు వెనుక... ఏంటి.. ముందు వెనుక చూసుకొని చేయాలి.. ఇపుడు చూడు నీ బండి రోడ్డుపాలు... నీ ఒళ్ళు బురదపాలు... నీ శరీరం బుగ్గిపాలు ఐపోయిందిర....రా అని పిడికిలి బిగించి దవడ మీద గుద్దాడు.... కొంచెం దూరం దొర్లిన హరి దెబ్బ నుంచి తేరుకుని ఎదురుగా చూసేసరికి అమాంతంగా చేతులు చాపి ఎగురుతున్న అతన్ని చూసాడు...
కానీ ఈసారి దెబ్బ పడనివ్వలేదు.... ఒక టర్న్ తిరిగి నెలకు చేతిని ఆనించి కాలితో తంతే అతను ఎగిరి అవతల పడ్డాడు ...జేబులో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఎగిరి పడిపోయాయి....ఉరకెత్తిన ఉగ్రంతో పరిగెత్తుకు వస్తున్నాడు హరి... simple గా లేచి కూర్చున్నాడు అతను... హరి పరిగెడుతున్నాడు... అతను కూర్చున్నాడు... హరి దగ్గరయ్యాడు... అయిన బెనుకు లేకుండా అక్కడే కూర్చున్నాడు...ఇంకా కాలితో ఇసిరి అవతలకి తంతాడు అన్న సమయానికి చేతిలోంచి గన్ తీసి ముడుకు మీద కాల్చాడు....
ఆ....ఆ...అంటూ నేల కూలాడు హరి...
ఏరా... మిస్ అయ్యిందా.... కానీ నేను మిస్ చెయ్యను... అంటూ ఎడమ చేతిలోని చాకుతో మీసం దువ్వుతున్నాడు..
ఇది horror ఆహ్ pyscho థ్రిల్లర్ ఆహ్ అని మీరు ఆలోచించండి ...
వీడి గురుంచి నేను ఆలోచిస్తా...
తాడుతో వాడి చేతులు కట్టేసి ఇంతటితో ఈ కధ సమాప్తం...అని ఒక maassie dialogue చెప్పాడు
Meet you again in next piece....



Comments
Post a Comment