అభినందన మూవీ రివ్యూ

 అభినందన !                                            


Review on Abhinandana : 

మొన్నటి ప్రేమ గర్వపడేలా,నేటి ప్రేమ అసూయపడేలా  మలచినటువంటి నిన్నటి అరవ ప్రేమగాధ "అభినందన"..

ఉదయపు యవ్వనంలోనే  ప్రేమలో పడతారు రాజా రాణి..రాజా మంచి చిత్రకారుడు, గాయకుడు. రాణి నృత్యకళాకారిణి.సాఫీగా సాగుతుంది వీళ్ళ ప్రేమకథ..ఒకరోజు మూడవ కాన్పుకి రాణి వాళ్ళ అక్కను,ఇద్దరి పిల్లలని తెచ్చి విడిచిపెట్టి మరల మద్రాసు వెళ్తాడు వాళ్ల బావ.ఒక ప్రమాదంలో రాణి వాళ్ళ అక్క గాయపడుతుంది..పిల్లల బాధ్యత రాణి చేతిలో పెట్టి చనిపోతోంది..కొన్ని కారణాల వల్ల మద్రాసు వెళ్లిన రాణి వాళ్ళ బావని పెళ్లి చేసుకోవలసి వస్తుంది..

రాణి ఎందుకు అలా చేసింది..?

మరి రాజా పరిస్థితి ఏంటి.?

వాళ్ళు కలుస్తారా..? వాళ్ళ ప్రేమ గెలుస్తుందా..? అనేదే "అభినందన" ..

◆ విశ్లేషణ :

మొదటి సీన్ నుంచి వాళ్ళ ప్రేమకథను మాత్రమే ఉద్ధరించి చూపించి అభినందన అన్న సినిమా పేరుకు సార్థకత చేశారు డైరెక్టర్ "  అశోక్ కుమార్  ".

ప్రేమ చిగురించడాన్ని పువ్వు విచ్చుకోవడంతో చూపించిన డైరెక్టర్ ప్రతిభ అద్భుతం.

ప్రియురాలి అందాన్ని అందగత్తెల అందానికే అర్ధం అని పాడించడం ద్వారా రాజాని ఒక గొప్ప గాయకుడిగా పరిచయం చేసాడు..

ఒక పాత్రని సునిశితంగా పరిచయం చేయడంలో సఫలీకృతం అయ్యాడనే చెపుకోవాలి...

సాధారణంగా ప్రేమికుల మాటలు అతిగా అనిపిస్తాయి. కానీ ఇందులో ప్రేమికుల మాటలు చాలా ఇంపుగా ఉంటాయి.

రాజా రాణి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చాలా అందంగా ఉంటుంది.చూసిన ప్రతి ఒక్కరి పెదవి చివర తెలియని చిరునవ్వు పుడుతుంది.

తెలియని చిరునవ్వు పుడుతుంది..

ఇంటర్వెల్ ముందు వరకు చాలా ప్రియంగా వాళ్ళ ప్రేమను చూపిస్తాడు...

మంచు కురిసే వేళలో...

మల్లె విరిసే వేళలో...

మనసు మురిసేవేలలో...

వాళ్ళను తొలకరి ప్రేమలో ముంచి తేల్చుతుంటాడు మన దర్శకుడు...

ఇక రెండవ భాగంలో పెళ్ళైన రాణి భాద్యతలకు తలొంచడం మనకు నిజజీవితాన్ని గుర్తుతెస్తుంది...

ప్రేమను తలుస్తూ తనలో తాను మధన పడుతూ ప్రపంచానికి అది తెలియకుండా తన భార్య పాత్రని పోషిస్తుంది రాణి...

ఇక ప్రేమకు దూరమైన రాజా

ప్రేమలేదని...

ప్రేమించరాదని...

అని బాధపడుతూ ఉంటాడు...

రాణి వాళ్ళ బావ వలన మళ్లీ కలిసిన రాజా రాణి ఎలా ప్రేమకు దగ్గరయ్యారు అనేదే మిగతా కథ...

మాట ...పాట...

ఈ రెండు సినిమాని ముందుకు నడిపించాయి..

ఒక నిత్యనూతన కథను ఎంచుకున్న దర్శకుడికి తోడుగా నిలిచింది మాస్ట్రో ఇళయరాజా ..

అతని స్వరానికి ఇంపు అనిపించే పదాలను అందించింది మాత్రం ఆచార్య ఆత్రేయగారు...!

ప్రతి పదం ఒక తేనె పూసిన జాబిలి...

తియ్యని హాయిని కలిగిస్థాయి...

నా "రంగులలో కలవో" అని తారకని అభివర్ణిస్తూ" మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ముగ్గులో " అంటూ "మన్మధుడితో జాతివైనం" పుచ్చుకొని  మరపే తెలియని నా హృదయం వలచి వలచుట తొలినేరం అంటూ రాజా భావాలను ఎప్పటికపుడు అచ్చుపొల్లుపోకుండా వ్యక్తపరుస్తూనే ఉన్నారు ఆత్రేయగారు..

చిత్రకారుడి పాత్రలో కార్తిక్ అభినయం., నాట్య కళాకారిణి పాత్రలో శోభనగారి అమాయకపు నటన వలన తెరమీద రాజరాణి అనే రెండు ప్రేమ పాత్రలకు జీవం వచ్చింది .

ఇక శరత్ బాబుగారు తననటానుభవానికి తగ్గట్టుగా తన పాత్రని పోషించారు..

కథ,కథనం,దర్శకత్వం,ఛాయాగ్రహణ బాధ్యతలను ఒంటిచేతితో నిర్వర్తించడం మామూలు విషయం కాదు..ఆ విషయంలో అశోక్ కుమార్ గారు విజయం సాధించారు..

సంగీతంతో ఇళయరాజాగారు...తనగళంతో ఎస్.పి.బాలు గారు పతాకస్థాయిలో నిల్చోపెట్టారు..


+ పాయింట్స్ :
●నటినటుల అభినయం,

●చిత్రనిడివి,

●పాటలు,సంగీతం.

●ముఖ్యంగా "రంగులలో కలవో" పాట..


-పాయింట్స్ :

● స్లో నరేషన్..

●క్లైమాక్స్...


◆మొత్తంగా అభినందన ఎన్నిసార్లు చూసిన కవ్వించే నిత్యనూతన ప్రేమకావ్యం..

                                             --Dreamz Dreamz

Comments

Popular Posts