చాలా బావుండిందండి....

" చాలా బావుంటుందండి.... "

                                                       -Kumar Raja


 అప్పుడే పుట్టా నేను...

"క్వా...వ్...క్వా....వ్..." అని ఏడుస్తుంటే....

ఇదిగో ఇదిగో తాతయ్య వచ్చారు అని మా నాని చూపించింది...

ఆ కోర మీసం చూసి ముసి ముసి నవ్వు నవ్వుతుంటే...

ఎవరు చూడకుండా మెల్లగా మా తాత నడుం మీద గిల్లేసాడు..

మళ్ళీ డ్యూటీ లోకి దిగిపోయా...కై మంటూ...

కానీ ఏ మాటికి ఆ మాట.... 

చాలా బావుండిందండి....


రా రా కన్నా...

కడుపార కన్నా..

నా చిటికిలు వింటూ చూస్తావే చూస్తావే నేనెవరో తెలుసా నాన్న...

అని రోజూ మా అమ్మ నన్ను చూసి మురిసిపోతుంటే....

వాహ్..

చాలా బావుండేదండి....


రేయ్ చెత్త నా కొడక...

సంవత్సరానికి స్కూల్ ఫీజ్ కడుతున్న...కనీసం పరీక్షల ముందైన పుస్తకం తియ్యరా బాలన్స్ అయ్యిద్ధి....

అని మా నాన్న తిట్టని తిట్టు తిడుతుంటే....

చాలా బావుండేదండి...


రేయ్ అన్నయ్య... 

నాన్న జేబులో ఇందాక 100₹ చూసా... నేను ఎవరు రాకుండా చూస్తా నువ్ వెళ్లి దొబ్బేయ్ అని మా తమ్ముడు ...

అంతా ఐపోయినాక వాడ్ని ఇరికించేసిన నేను....

హహ... 

చాలా బావుండేదండి...


అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్లినపుడు

 రేయ్ బావ....

పక్క వీధిలో సూపర్ అమ్మాయి ఉంది... 

నీకు చెల్లి ఔద్ధో...

నాకు చెలి ఔద్ధో... 

చూసుకుందాం పదా అని మా బావ ...

అక్కడికి వెళ్ళాక

ఇదిగో ఈ బెత్తం నీదో...

                       వాడిదో... 

                      అన్న ఆ పిల్ల అయ్య...

చాలా బావుండేదండి...


ప్రేయసి వధనానికి పెదవి చుట్టాన్ని పరిచయం చేసిన రోజు....

చాలా బావుండిందండి...


"మేం వెళ్లిపోతున్నాం...." అని కాలేజి క్యాంటీన్ కి వీడ్కోలు చెపిన రోజు..


"అనుకున్నంత సులభం కాదు నువ్ " అని బాధ్యతల్ని తిట్టుకున్న రోజు....

చాలా బావుండేవండి.....


మొదటి జీతం తెచ్చిన రోజు....

మా రాయల్ నాన్నకి Royal enfield కొన్న రోజు...

మా అమ్మకి మంచి దేవుడి గది ఉన్న ఇల్లు కట్టిన రోజు...

అన్ని ఇపుడు గుర్తొస్తుంటే చాలా బావున్నాయండి....


కొత్త చుట్టం ఇంటికొచ్చిన రోజు....

"ఏవండి... ఏవండి" అని నన్నొదలకుండా నా వెనుక తిరిగిన సమయం....

మొదటి ప్రయాణం....

మొదటి గొడవ...

మొదటి దూరం...

మా ఆవిడకి సంబంధించి ప్రతీది చాలా అంటే చాలా బావుండేదండి...


వారసుడు పుట్టిన రోజు....

"డాడా.... డాడా..." అని నన్ను పిచ్చి పిచ్చి చేసే పిచ్చ నా కొడుకు వచ్చిన రోజు....

మా అమ్మలా వాళ్ళ అమ్మ మురిసిపోతుంటే చూసి నేను ఆనందిస్తున్న రోజు.....

అందరి జీవితాల్లో చాలా బావుండే రోజండి అది....


ఇంకా... బావుండేవంటే...

పెళ్ళైనంకా మొదటి సారిగా అనుకోకుండా మొదటి ప్రేయసిని చూసిన రోజు....

ఒకవైపు జలసి... నాకు దక్కలేదని....

ఇంకోవైపు ఆనందం....బొకడా గాడు దొరికాడని...



(అందరూ ఒక్కసారిగా నవ్వారు....)

 

ఇంకేం లేవా తాత గారు అని అడిగారు అందరూ....

తాతయ్య : ఉన్నాయమ్మ.... ఎందుకు లేవు...

నా జీవితంలో మనుషులు మాత్రమే ఉన్నారు.... కాబట్టి చాలానే ఉన్నాయి..

ఇవి చాలు లెండి... సరే నా ....

LIFE IS WHAT YOU EXPECT TO DO...AND WHAT YOU DO...

 ప్రతీ దాన్ని అంగీకరించ గలిగితే ప్రతీ క్షణం కూడా

 "చాలా బావుంటుందండి"...



Comments

Post a Comment

Popular Posts