అసలేంటి చీరాల-పేరాల ఉద్యమం ..?

చీరాల -పేరాల ఉద్యమం :-
నా పేరు రామయ్య...
ఊరు చీరాల...
ఏ చీరాల అనుకుంటున్నారు...
ప్రకాశం జిల్లా  బాపట్ల తాలూకా...
నాకొక కూతురు, ఒక కొడుకు...
నాకు రోజు కూలి 10₹₹₹₹₹౯ ...ఇంటి మీద ఖర్చులు పోగా ఒక 100₹ మిగులుతుంది ...
ఆడపిల్ల ఉంది కదా....కట్నానికి సొమ్ము ఉంచుకోవాలి కాబట్టి సీటీకాయలో వేసి మా ఇంటి దాయి ఉంచేది...

అప్పటికి మా పిల్లకి పదేండ్లు ఉంటాయి అనుకుంటా...మా ఊరిని యూనియన్ నుంచి విడదీసి మున్సిపాలిటీలో కలిపేశారు బాబు....

అవును చెప్పలేదు కదా...
మా ఊరు ఇంకొక నాలుగూళ్ళు ఒక యూనియన్ ...మా యూనియన్ నుంచి ఏడాదికి 4000 పన్ను పోయేది సర్కారోల్లకి...
మరి ఎప్పుడైతే ముంచిపాల్టీ సేసింరో మా మీద పన్ను భారం పడింది బాబు....
పంటలు పండకపాయే...
పని  ఉండిలేనిదాయే...
పన్ను కట్టడానికి పిల్ల పెళ్లికి దాచిన సీటీకాయ పగలగొట్టా....
పన్ను భారం మా మీద భారీగా పడింది...

నేనే కాదు.. నాలంటోళ్లు చాలా మంది....
ఏఁ  చేయాలో తోచుటలేదు....
                   దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు

ఆ సమయంలో మాకు కనిపించిన దిశ నిర్దేశకుడు "దుగ్గిరాల గోపాలకృష్ణ" గారు....ఒక బ్రాహ్మణ మహనీయుడు...
ఉన్నత చదువులలో నాణ్యత కనిపించకపోగా....ఈ చీరాల లో అతను ఆంధ్ర విధ్యా పీఠ గోష్ఠి స్ధాపించడానికి వచ్చిన ఆయన మా స్థితి గతులని చూసి మమ్మల్ని ముందుకు నడిపించేందుకు సన్నదమయ్యారు....

అప్పటికి  సర్కారు "జస్టిస్ పార్టీ" వాళ్ళది... "రాజా రామ రాజా అయ్యంగార్ " గారు నాయకుడుగా ఉన్నారు ...ఆరోజుల్లో స్థానిక పరిపాలన ముఖ్య నాయకుడి చేతులొనే ఉండేది... అతనికి పెట్టని అజ్జి లేదు... రాయని లేఖ లేదు... కానీ స్పందన లేదు....బహుశా "జస్టిస్ పార్టీ" బ్రాహ్మణేతర పార్టీ బ్రాహ్మణ గోపాలకృష్ణ కి తలవంచినట్టు ఉంటుంది అని కాబోలు...

ఇంకా చలించలేక ఉద్యమం మొదలుపెట్టాం...
పన్నులు కట్టడం ఆపేసాం..."ఏ" అని అడిగితే సమాధానం ఇవ్వడం మానేశామ్...గట్టిగా మాట్లాడితే పట్టించుకోవడం మానేశామ్...
అయితే ఇది చూసి తట్టుకోక 21 మందిని బంధించి చిత్రవద పెట్టారు...
అందులో ఒక మహిళ కూడా ఉంది....
బహుశా చరిత్రలోనే నిర్బంధానికి గురైన మొదటి మహిళ ఆవిడేనేమో...
ఆవిడే దేశ  బాంధవిగా పిలువబడే దువ్వూరు సుబ్బమ్మ.....
అయితే సర్కారుని ప్రతిఘటించిన ఈ ప్రజలకి దన్నుగా ఉండడానికి గోపాల కృష్ణగారు "రమాదండు" అనే స్వచ్చంద్ర సేవ సంస్థను స్థాపించారు...
ఈ రామదండు అనేకేతర రాష్ట్ర కార్యాలలో పాలుపంచుకుంది....
గోపాలకృష్న గారి మంచితనాన గాంధీజీ గారు కూడా వచ్చి మా ఊరిని సందర్శించారు...
మమ్మల్ని శాంతిగా ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని జరపమని చెప్పి,ఇంకొక సలహా ఇచ్చారు...
మున్సిపాలిటీలో మా ఇండ్లను వదిలి ఊరి దాటి వెళితే సర్కారు దిగి వస్తుంది అన్నారు....
1921 ఏప్రిల్ 25న ఊళ్ళు వదిలేసి వేరే దగ్గరికి వెళ్లిపోయాం.... దానికి రామనాగరం అని పేరు కూడా పెట్టుకున్నాం...కానీ ఆ భూములు మావి కాదు... సర్కారోల్లవి...వాటి మీద కూడా పన్నులేశారు సర్కారోళ్ళు....
ఆ పన్ను కట్టలేక.... 
తిరిగి స్వగృహాలకి వెళ్లలేక...
 ఇక్కడ ఉండడానికి ప్రకృతి సహకరించకపోగా.....
అనేక అవస్థలు పడ్డాం....!

మాకోసం అనేక సభలలో గోపాలకృష్న గారు నిధులు సమకూర్చేవారు... ఇది చూసి ఓర్వని ప్రభుత్వం అతన్ని నిర్బంధించింది..
రాజు లేని ఉద్యమం ఎలాంటిదో తెలుసుగా...
చెల్లా చెదురు అయిపోయింది...
ఉద్యమాన్ని ఆపి సొంత ఇళ్ళకి పోయాం....
తర్వాత మా బాధలు అలానే కొనసాగాయి...

కూతురు పెళ్లి చేయడానికి ఇల్లు తాకట్టు పెట్టాను...

ఆ తర్వాత పరిపాలన మంత్రిగా నియమింపబడిన గోపాల రెడ్డి గారు మున్సిపాలిటీ ని రద్దు చేశారు....

ఇది నా కథ...
చీరాల... పేరాల కథ...
దుగ్గిరాల వారి కథ...

                                                              -Kumar Raja

Comments

Post a Comment

Popular Posts